పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : బలరాముఁడు ముష్టికుని జంపుట

ప్పుడు ముష్టికుం మరు లీక్షింపఁ
జెప్ప బెట్టులుగాఁగ సిరితోడఁ దొడరి
పులులచందమున నుబ్బుచుఁ బొంగిపొంగి
లులులాయంబులగిది దాఁటుచును
పాయుచు డాయుచు బాహార్హళముల
వ్రేయుచు నొగిఁ బెక్కువిధములఁ బోర;
ద్రిష్టించి చూపర దిగులొంద నిలిచి
ముష్టికుం డడరి రాముని బెట్టుఁ బొడువ
ఫాలంబు పగిలి తప్పక నెత్తురొలుక.
నేపైఁ బడి లేచి నీలాంబరుండు -  - 220
పిడుగు వ్రేసిన భంగిఁ బిడికిటఁ బొడువఁ
డితన్నుకొని జెట్టి ప్రాణముల్ విడిచె;
తుఁడైన ముష్టికుఁ ని వాని తమ్ముఁ
తిబలాఢ్యుఁడు కూటుఁ ను వాఁడు సీరిఁ
బోకుఁబోకని దాఁకి పొరిముష్టిఁ బొడువ
యాటుఁ దెకటార్చి యార్చె మిన్నదువఁ
గోల ప్రభృతులొక్కొట యేడుగురను
వాసుదేవుఁడు వారి ధియించె నంతఁ
నుఁగొని మల్లవర్గము వారుటయును
నిమిషావలిఁ జూచి చ్చెరువందె.